పుదీనా పచ్చడి కోసం అవసరమైన పదార్థాలు: , ఒక కప్పు పుదీనా ఆకులు, అర కప్పు కొత్తిమీర,3 పచ్చి మిర్చి, ఒక తరిగిన ఉల్లిపాయ, ఒక తరిగిన టమోటా, అర టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్
పుదీనా మరియు కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా తొలగించాలి.
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరువాత, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి, మృదువుగా అయ్యే వరకు వేయించాలి.
వేయించిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ఈ మిశ్రమం, పుదీనా, కొత్తిమీర ఆకులు, ఉప్పు, మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌తో సర్వ్ చేయండి.
పచ్చడిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే ఎంతో రుచిగా ఉండడమే కాకుండా.. ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వంట నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.