దోస అనేది చాలామందికి ఫేవరెట్ టిఫిన్. అలాంటి దోసెలో ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర దోస ఎప్పుడైనా ట్రై చేశారా..?
పాలకూరతో తయారయ్యే ఈ దోశ పోషక విలువలతో పాటు రుచికరంగా కూడా ఉంటుంది.
పాలకూర – 1 కట్ట, ఇడ్లీ బియ్యం – 2 కప్పులు, ఉద్దిపప్పు – ½ కప్పు, జీలకర్ర – ½ టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నీరు – తగినంత, నూనె – దోస కోసం సరిపడినంత.
ఇడ్లీ బియ్యం, ఉద్దిపప్పు నానబెట్టి.. రాత్రంతా ఉంచాలి. తరువాత పాలకూర, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.
తయారైన మిశ్రమాన్ని వేడిన పెనం మీద పోసి, నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.
పాలకూరలో ఐరన్, విటమిన్ A, C అధికంగా ఉండటంతో శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ దోశను పెసరపప్పు చట్నీ, టమాటో చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.