బాదం పప్పుల్లో ప్రోటీన్, బయోటిన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. మరి అలాంటి ఈ బాదం పప్పులు ఎలా ఉపయోగించుకోవచ్చు.
రాత్రి 5-6 బాదం పప్పులు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే తొక్క తీసి తినాలి. ఇది జుట్టు రాలడం తగ్గించి, కుదుళ్లను బలంగా చేస్తుంది.
బాదం నూనెను తలకు మర్దన చేయాలి. ఇది జుట్టు కుదుళ్లలోకి లోతుగా వెళ్లి పోషణ అందిస్తుంది.
బాదం, బనానా కలిపి స్మూతీ తయారు చేసుకోవచ్చు. ఇది కనీసం వారంలో మూడుసార్లు తాగితే.. జుట్టుకు అవసరమైన విటమిన్‌లు అందిస్తుంది.
పైన చెప్పిన విధంగా బాదం ఉపయోగిస్తే..జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.