అవకాడోలో విటమిన్ ఇ, బయోటిన్, ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల జుట్టు వేగంగా పెరిగేందుకు ఇది సహాయపడుతుంది.
అవకాడోలో ఒమేగా-3, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో జుట్టు పోతున్నవారికి ఇది మంచిది.
ప్రతిరోజూ అవకాడో తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు అవకాడో గుజ్జును తలకు రాసి 30 నిమిషాలు ఉంచి, నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
అవకాడో, బాదం పాలు, తేనె కలిపి స్మూతీగా తాగితే జుట్టుకు తగినంత పోషణ లభిస్తుంది.
అవకాడోలో ఉండే ప్రోటీన్, ఐరన్ వల్ల జుట్టు ఊడకుండా కాపాడుతుంది. ఇది తలకి తగిన తేమను అందించడంతో జుట్టు పొడిగా మారకుండా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడో తినడం వల్ల జుట్టు నల్లగా, దట్టంగా మారటమే కాకుండా, సన్నగా ఉండే జుట్టు గట్టిగా మారే అవకాశం ఉంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.