మునగాకు మెటాబోలిజం పెంచి, శరీరంలో అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
మునగాకు 1 కప్పు, అన్నం 2 కప్పులు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీస్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, ఆవాలు 1 టీస్పూన్, జీలకర్ర ½ టీస్పూన్, కరివేపాకు కొన్ని, ఉప్పు రుచికి తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్.
వేడి చేసిన పాన్‌లో నెయ్యి వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించాలి. అందులో మునగాకు వేసి రెండు నిమిషాలు వేపాలి. అనంతరం ఉడికించిన అన్నం, ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం చల్లి సర్వ్ చేయండి.
మునగాకు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీనివల్ల బాడీలో టాక్సిన్స్ బయటికి వెళ్లి, పొట్ట కరిగేలా చేస్తుంది.
ఈ మునగాకు పులిహార బరువు తగ్గే ప్రయాణంలో ఎంతో సహాయపడుతుంది. రోజుకు ఒకసారి దీన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
మునగాకు విటమిన్ సి, ఐరన్, కాల్షియం సమృద్ధిగా కలిగి ఉండటంతో ఇది శరీరానికి శక్తినిస్తూనే కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.