Telangana Rajbhavan: రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరిగిందా..తేనీటి విందుకు రాని సీఎం కేసీఆర్..!

Telangana Rajbhavan: హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులను సైతం ఆహ్వానించారు. ఐతే గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండిపోయారు. చివరి నిమిషంలో సీఎం తన నిర్ణయం మార్చుకున్నారు.  కార్యక్రమానికి రావడం లేదని రాజ్‌భవన్‌కు సీఎంవో కార్యాలయం సమాచారం అందించింది.

ఎట్‌ హోమ్‌కు సీఎం కేసీఆర్ హాజరవుతారని రాజ్‌భవన్‌కు తొలుత సమాచారం పంపించారు. చివరకు రావడం లేదని తెలిపారు. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజ్‌భవన్‌ వైపు రాలేదు. కేవలం అధికారులు మాత్రమే కార్యక్రమానికి తరలివచ్చారు. ఎట్ హోం కార్యక్రమంలో సీఎస్ సోమేష్‌కుమార్, సీపీలు సీవీ ఆనంద్, మహేష్‌ భగవత్‌తోపాటు ఉన్నతాధికారులు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై గవర్నర్ తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్‌ మధ్య వార్ నడుస్తోంది. మొదట్లో సీఎం, గవర్నర్ మధ్య సఖ్యత ఉండేది. ఐతే ఇటీవల ఇరువురి మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్ తమిళిసై జిల్లాల పర్యటనకు మంత్రులు, అధికారులు పాల్గొనడం లేదు. ప్రోటోకాల్‌పై పెద్ద రగడే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తనను కనీసం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శించారు. ఆడపడుచు అని లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఢిల్లీ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగాన్ని లేకుండా చేశారని ఆక్షేపించారు. జిల్లాల టూర్లకు వెళ్లినా అధికారులు పాల్గొనడం లేదన్నారు. తన తల్లి చనిపోయినా సీఎం కేసీఆర్ పరామర్శించలేదని..కనీసం మాట్లాడలేదన్నారు గవర్నర్.

అప్పట్లో ఆమె వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మహిళలను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనికి టీఆర్ఎస్ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ నేతల వ్యవహారిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తాజాగా రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంతో మరింత దుమారం రేగే అవకాశం ఉంది.

Also read:Rohit Sharma: ఆసియా కప్‌లో జయసూర్య, సచిన్ రికార్డు బద్ధలు కానుందా..? రోహిత్ జోరు కొనసాగిస్తాడా..?

Also read:AP Rajbhavan: ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం..దూరం దూరంగా జగన్, చంద్రబాబు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
at home programme in rajbhavan at hyderabad cm kcr and ministers not present
News Source: 
Home Title: 

Telangana Rajbhavan: రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరిగిందా..తేనీటి విందుకు రాని సీఎం కేసీఆర్..!

Telangana Rajbhavan: రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరిగిందా..తేనీటి విందుకు రాని సీఎం కేసీఆర్..!
Caption: 
at home programme in rajbhavan at hyderabad cm kcr and ministers not present(file)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

గవర్నర్ తమిళిసై తేనీటి విందు

హాజరుకాని సీఎం కేసీఆర్

Mobile Title: 
Rajbhavan: రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరిగిందా..తేనీటి విందుకు రాని కేసీఆర్
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Monday, August 15, 2022 - 20:16
Request Count: 
81
Is Breaking News: 
No