Jr NTR Fans Angry: చరణ్ కు పవన్ అభినందనలు.. ఇదేం న్యాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్!

Jr NTR Fans Angry on Pawan Kalyan: ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్.ఆర్.ఆర్' పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై 'బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్' ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింప చేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది అని పవన్ రామ్ చరణ్ కీ, దర్శకుడు శ్రీ రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఒకే సినిమాలో పని చేసిన ఇద్దరు నటులను  మీరు అభినందనలు చెప్పలేక పోయారు, మీ అన్న కొడుకు మాత్రమే చెప్పుకున్నారు, అలాంటి మీరు రేపు మీరు పొరపాటున సీఎం అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలరా పవన్ కళ్యాణ్ అంటూ నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది.

వాస్తవానికి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. అయితే పవన్ అభినందనలు తెలిపిన సమయంలో చరణ్ తో పాటు సినిమా దర్శకుడు రాజమౌళికి కూడా తెలిపారు కానీ సినిమాలో కీలక భాగమైన ఎన్టీఆర్ కు ఎందుకు విస్మరించారు. ఎందుకు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు అంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఒకరకంగా ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. కావాలనే మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సైతం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా మొత్తం క్రెడిట్ రామ్ చరణ్ కి దక్కేలా చేసుకుంటున్నారని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం మీద సినిమా యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాల్సి ఉంది. 

Also Read: Anchor Shyamala on Ram Charan: రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా?

Also Read: Suguna Sundari Dance: బాలయ్య పాటకు మెగా కోడలు డ్యాన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
English Title: 
Jr NTR Fans Angry on Pawan Kalyan for congratulating ram charan and rajamouli only
News Source: 
Home Title: 

Jr NTR Fans Angry: చరణ్ కు పవన్ అభినందనలు.. ఇదేం న్యాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్

Jr NTR Fans Angry: చరణ్ కు పవన్ అభినందనలు.. ఇదేం న్యాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్!
Caption: 
Source:twitter
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Jr NTR Fans Angry: చరణ్ కు పవన్ అభినందనలు.. ఇదేం న్యాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్
Chaganti Bhargav
Publish Later: 
No
Publish At: 
Sunday, February 26, 2023 - 23:13
Request Count: 
63
Is Breaking News: 
No