కలబంద రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
కలబంద రసం సిద్ధం చేయడానికి, కలబంద కాండం కత్తిరించండి. దాని తొక్క తీసి లోపల ఉన్న జెల్ ను బయటకు తీయండి. ఈ జెల్ కు రెండు అల్లం ముక్కలు, అర టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా నీరు వేసి మిక్సర్ లో బ్లెండ్ చేయండి. తేనె లేదా చక్కెరతో త్రాగాలి.
విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే కలబంద రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది.
కలబంద రసంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే ఎంజైమ్లు కూడా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది, గ్యాస్, ఉబ్బరం నివారించబడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కలబంద అనేది యాంటీఆక్సిడెంట్లకు నిలయం. వాటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కలబంద రసం తాగడం వల్ల మీ చర్మానికి తేమ అందుతుంది.
కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం తగ్గుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కలబంద రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కలబంద రసం తాగడం వల్ల నోటి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
రోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.