పిల్లలకు చాలామంది ప్రతిరోజు బంగాళదుంపతో తయారుచేసిన ప్యాకెట్ చిప్స్ ఇస్తూ ఉంటారు. నిజానికి ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.
';
కొంతమంది బంగాళదుంపలను ఇంట్లోనే చిప్స్ లాగా తయారు చేసుకుని ఇస్తూ ఉంటారు. అయితే వీటికి బదులుగా క్యారెట్‌తో తయారు చేసిన చిప్స్ ఇవ్వడం వల్ల పిల్లలు మంచి ప్రయోజనాలు పొందుతారు.
';
క్యారెట్‌తో తయారు చేసిన చిప్స్‌లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
';
మీరు కూడా ఇలా ఇంట్లోనే పిల్లల కోసం క్యారెట్ చిప్ తయారు చేసుకోండి.
';
క్యారెట్ చిప్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: క్యారెట్లు: 2-3 (సన్నగా చిప్స్ కోసం ముక్కలుగా చేసుకున్న), నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా, ఉప్పు: రుచికి సరిపడా, కారం: రుచికి సరిపడా, చాట్ మసాలా: 1/2 టీస్పూన్ (కావలసిన పదార్థాలు)
';
తయారీ విధానం: ముందుగా క్యారెట్లను శుభ్రం చేసుకొని వాటిపైపొట్టు తీసి చిప్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పల్చగా కట్ చేసుకోవడం చాలా మంచిది.
';
ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలో వేసి ఆవిరిపై రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేడి చేసి.. 20 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టుకోండి.
';
ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాత వాటిని తీసి కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయిపుకోండి.
';
ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే క్యారెట్ చిప్స్ రెడీ అయినట్లే..