పుట్టగొడుగుల వేపుడు ఇలా చేస్తే.. ఈ సూపర్ లాభాలు మీసొంతం..!

Shashi Maheshwarapu
Jan 30,2025
';

పుట్టగొడుగులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

';

ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ డి వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.

';

పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచడానికి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.

';

ఇది తయారు చేయడం చాలా సులభం.

';

కావలసిన: పుట్టగొడుగులు - 250 గ్రాములు, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)

';

పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, టమాటా - 1, కొత్తిమీర

';

పసుపు - 1/2 టీస్పూన్, కారం - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్

';

గరం మసాలా - 1/2 టీస్పూన్, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత

';

తయారీ: ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

';

ఒక కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

';

ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

';

తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.

';

ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.

';

పుట్టగొడుగులు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

';

మూత పెట్టి పుట్టగొడుగులు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

';

చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి.

';

పుట్టగొడుగుల వేపుడు సిద్ధంగా ఉంది.

';

VIEW ALL

Read Next Story