కావలసిన పదార్థాలు: నూనె - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, ఆవాలు - 1/4 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 2 కప్పులు
';
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకొని 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది..
';
పుదీనా ఆకులను బాగా శుభ్రం చేసి మిక్సీ జార్లో వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని వేడి చేసుకోండి.
';
బాగా వేడి చేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయ చీలికలు, బగారా మసాలా, తురిమి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి వేపుకోండి.
';
అన్ని బాగా వేసిన తర్వాత అందులోనే పుదీనా మిశ్రమం కూడా వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత రైస్ వేసి మరికొద్దిసేపు అటు ఇటు కలుపుతూ వేసుకోండి.
';
అన్ని బాగా వేగిన తర్వాత బియ్యం ఉడకడానికి కావాల్సినంత నీటిని పోసుకొని.. బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఓసారి చెక్ చేసుకుని సర్వ్ చేసుకోండి..