హై ప్రోటీన్ మయోనిస్.. సులభంగా ఇలా చేసుకోండి..

Dharmaraju Dhurishetty
Jan 19,2025
';

ప్రతిరోజు మయోనిస్ తినడం అంత మంచిది కాదు. కానీ చాలామంది ఇప్పుడు విచ్చలవిడిగా తింటున్నారు.

';

మార్కెట్లో లభించే మయోనిస్ వివిధ రకాల ప్రమాదకరమైన నూనెలతో తయారుచేస్తారు. అంతేకాకుండా జంతువుల కొవ్వును తీసి కూడా తయారు చేస్తున్నారు.

';

రుచికరమైన ఆరోగ్యకరమైన మయోనిస్ ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

';

ఇంట్లోనే సులభంగా మయోనిస్ని ఎలా తయారు చేసుకోవాలో? కావాలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు ఒక కప్పు, పన్నీర్ ముక్కలు ఒక కప్పు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, తగినంత మిర్యాల పొడి

';

ఈ మయోనిస్ ని తయారు చేసేందుకు ముందుగా ఒక మిక్సీ గ్రైండర్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో జీడిపప్పు, పన్నీర్, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్సీ పట్టుకోండి.

';

అన్నింటినీ బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని మరింత మృదువుగా తయారు చేసుకోవడానికి ఒక రెండు టీ స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొని వేసుకొని మిక్సీ కొట్టుకోండి. అంతే మయోనిస్ రెడీ అయినట్లే.

';

ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే కావలసినంత ఉప్పు, మిర్యాల పొడి వేసుకొని మరికొద్ది సేపు బాగా మిక్సీ పట్టకండి.

';

VIEW ALL

Read Next Story