ద్రాక్ష రుచికరమైంది మాత్రమే కాదు అందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బ్లాక్ వర్సెస్ గ్రీన్ గ్రేప్స్ రెండింటిలో ఎందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఏవి తింటే ఆరోగ్యానికి లాభం తెలుసుకుందాం.
గ్రీన్ గ్రేప్స్ లో ఎక్కవ మొత్తంలో విటమిన్లు కె, సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి.
బ్లాక్ గ్రేప్స్ లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది.
గ్రీన్ గ్రేప్స్ లో క్యాటెచిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గిస్తుంది.
బ్లాక్ గ్రేప్స్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.
నలుపు, ఆకుపచ్చ రెండింటిలోనూ ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను ఆకస్మికంగా పెంచుకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది.
నలుపు, ఆకుపచ్చ ఈ రెండింటిలోనూ అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఏది తినాలనే మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
తీపి ఇష్టపడేవారికి బ్లాక్ గ్రేప్స్ బెస్ట్..పుల్లగా ఉండాలంటే గ్రీన్ గ్రేప్స్ బెస్ట్