సింగిల్ గ్లాస్ ఇది తాగితే.. గ్యాస్ట్రిక్ సమస్య పరార్..
Dharmaraju Dhurishetty
Feb 04,2025
';
ఇప్పటి యువతలో వస్తున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు.
';
మరికొంతమంది అయితే కేవలం పండ్లతో కూడిన రసాలను తయారు చేసుకొని తాగుతున్నారు. ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా జ్యూసులు తాగడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి.
';
ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంతో పాటు లెమన్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
';
చాలామంది లెమన్ గ్రాస్ జ్యూస్ తయారు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు పడుతున్నారు. దీని వల్ల సరైన మోతాదులో పోషకాలు పొందలేకపోతున్నారు.
';
ముఖ్యంగా గ్యాస్ట్రిక్తో పాటు ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన పద్ధతిలో ఇలా లెమన్ గ్రాస్ జ్యూస్ ని తయారు చేసుకొని తాగండి.
';
కావలసిన పదార్థాలు: లెమన్ గ్రాస్ - ఒక కట్ట, నీరు - 2 కప్పులు, తేనె లేదా చక్కెర - రుచికి తగినంత, నిమ్మరసం - 1 చెంచా
';
తయారీ విధానం: ముందుగా ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి.
';
గడ్డి బాగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గడ్డిని వేసుకుంటే బాగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత అందులోనే తేనె, నిమ్మరసం వేసుకొని మరోసారి మిక్సీ కొట్టుకోండి.
';
ఇలా తయారు చేసుకున్న జ్యూస్ లో తగినంత అల్లం కలుపుకొని తాగితే.. గ్యాస్ట్రిక్ సమస్యలు అసలు రావు.
';
ఇలా అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చివరగా మిశ్రమాన్ని వడకట్టుకొని ఒక గాజు గ్లాసులోకి జ్యూస్ ని తీసుకోండి.