మీరు సెనగ పిండితో కాకుండా, దోశ పిండితో ఎంతో రుచికరమైన క్రిస్పీ స్నాక్ చేసుకోవచ్చు. అదే ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన పునుగులు.
ఈ పునుగులు రెడీ చేయడానికి, మిగిలిపోయిన దోశ పిండిలో.. కొంచెం పెరుగు బాగా కలిపి.. చిటికెడు ఉప్పు, పసుపు, తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఈ పిండిని చిన్న మోతాదులో తీసుకుని.. బోండాలు లాగా చేసుకుని.. స్టవ్ పైన నూనె పెట్టి.. అది వేడెక్కాక వేసుకోండి.
అంతే ఎంతో క్రిస్పీగా ఉందే.. పునుగులు తయారవుతాయి.
ఈ క్రిస్పీ పునుగులను.. నూనె తక్కువగా చేసుకోవాలి అంటే.. గుంతపొంగనాల పాన్ లో అదే పిండిని పెట్టుకొని చేసుకోవచ్చు.
ఇది చలికాలంలో సాయంత్రం పూత తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.
ఈ పునుగులను కొబ్బరి చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి