ఈ సూప్ బరువు తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం. మీరు దీన్ని రాత్రి తినడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. మరి ఈ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం
ఈ సూప్ తయారీ కోసం క్యారెట్, టమాటా, బీన్స్.. చిన్న ముక్కలుగా తరుగుకొని.. చిన్న పాన్ లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని వీటన్నిటిని ఉడకబెట్టండి.
వాటిలో పసుపు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి వేసి.. చివరగా ఒక గ్లాస్ నీళ్లల్లో కార్న్ ఫ్లోర్ కరిగించుకొని అందులో వేయండి. ఈ సూప్ బాగా చిక్కబడే వరకు అలానే ఉంచండి.
రాత్రి వేళలో అన్నం బదులు ఈ సూప్ తాగితే చాలా మంచిది. తక్కువ క్యాలరీలు ఉన్న ఈ సూప్ తక్కువ క్యాలరీలను అందించడమే కాకుండా త్వరగా జీర్ణం అవుతుంది.
ఈ సూప్‌లో ఉన్న కూరగాయలు ఆకలి దూరం చేస్తాయి అంతేకాకుండా ఈ సూపులో న్యూట్రియంట్ రిచ్‌గా ఉంటాయి, వీటిని తీసుకోవడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఈ సూప్‌లో ఉందే కూరగాయలు.. అన్నీ కూడా ఎక్కువ పీచు పదార్థం కలిగినవి కావడంతో.. కొవ్వుని త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.