ఓట్స్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్ , ½ కప్పు బెల్లం , ¼ కప్పు బాదం , ¼ కప్పు వాల్‌నట్స్ , 2 టీస్పూన్లు అవిసె గింజలు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, ½ టీస్పూన్ యాలకుల పొడి
ఓట్స్‌ను తక్కువ మంటపై 2-3 నిమిషాలు వేయించి, చల్లారనివ్వాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి కొద్దిపాటి నీటితో వేడి చేసి, సిరప్ మాదిరిగా తయారు చేసుకోవాలి.
వేయించిన ఓట్స్, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలను మిక్సీ జార్‌లో పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిలో బెల్లం పాకం, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులతో చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి.
ఈ లడ్డులను టిఫిన్ టైమ్‌లో లేదా స్నాక్స్‌గా తీసుకోవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు లడ్డులు తినడం ఉత్తమం.
ఈ లడ్డులను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఒక వారం వరకు నిల్వ చేయవచ్చు.
ఈ లడ్లు ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.