గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యితో తయారు చేసుకుని లడ్డూ జీర్ణక్రియను మెరుగుపరచి, పొట్టపై పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
గోధుమ రవ్వలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది పొట్ట నిండిన భావాన్ని కలిగించి, అధిక ఆహారం తినకుండా నివారిస్తుంది.
బెల్లంలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నెయ్యి శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
గోపక్కధుమ రవ్వను నెయ్యిలో వేయించి పెట్టుకోండి. మరోపక్క నీటిని మరిగించి అందులో బెల్లం వేసుకొని అది బాగా చిక్కబడ్డాక గోధుమ రవ్వ వేసుకొని కలుపుకొని.. బాగా చిక్కబడ్డాక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని లడ్లు లాగా చేసుకోండి.
ఈ లడ్డూ రోజూ తినడం ద్వారా మీ మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది, శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది.
రొటీన్‌లో ఈ లడ్డూని చేర్చుకుం,టే బరువు తగ్గడమే కాకుండా, శక్తిని కూడా పెంచుతుంది.
ఈ పవర్ఫుల్ లడ్డూ ముఖ్యంగా పొట్ట తగ్గించడంలో సహాయపడుతుంది. సహజమైన ఉపాయాలతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే దీన్ని ట్రై చేయండి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.