బ్రౌన్ రైస్ నెమ్మదిగా జీర్ణమై ఎక్కువ సమయం ఆకలి పట్టకుండా ఉంచుతుంది. పుదీనా శరీరంలోని కొవ్వును కరిగించి మెటబాలిజాన్ని పెంచుతుంది.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పుదీనా వ్యర్థాలను బయటకు పంపి కడుపును శుభ్రంగా ఉంచుతుంది. అందుకే బ్రౌన్ రైస్ తో చేసే పుదీనా పులావ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ముందుగా కుక్కర్లో నెయ్యి వేసుకొని.. బిర్యానీ ఆకులు, ఎర్రగడ్డ, టమాటా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించిన తర్వాత.. పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి. చివరిగా నానబెట్టిన బ్రౌన్ రైస్ ని అందులో వేసి.. కుక్కర్ మూసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.
ఈ పులావ్ ని..మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంగా తీసుకుంటే వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ పుదీనా పులావ్ ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, రుచికరమైన భోజనం కూడా. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడం తేలికవుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే.