పెరుగు రోజు తినడం వల్ల.. ఇది డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది అనే విషయం మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే కానీ ఇది ఎలా తీసుకోవాలో చదవండి.
ఉదయాన్నే పెరుగు తినడం ద్వారా షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఇది మీ శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను నియంత్రించడంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.
పెరుగు యాంటీఆక్సిడెంట్లు, ప్రొబయోటిక్స్‌తో నిండిన ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, గ్లూకోజ్ విడుదలను నియంత్రిస్తుంది. పెరుగు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
రోజూ ఉదయం ఒక చిన్న బౌల్ లో పెరుగు తీసుకొని కుదిరితే అందులో కొన్ని మొలకెత్తిన విత్తనాలు కలుపుకొని తినండి. ఉదయాన్నే ఇడ్లీ దోశలు లాంటి టిఫన్లు తినే బదులు.. ఇది తినడం ద్వారా శరీరంలో షుగర్ లెవెల్స్ నిరంతరం కంట్రోల్ లో ఉంటాయి.
అయితే ఈ పెరుగు తీసుకునేటప్పుడు ఇందులో పెద్దగా మీగడ లేకుండా ఉండేతట్టు చూసుకోండి.
ఈ సహజ పదార్థం తీసుకోవడం ద్వారా మీరు డయాబెటిస్ నుంచి కాపాడుకోగలుగుతారు. తద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.