హిసాబ్ బరాబర్ (Zee5-24 జనవరి): మాధవన్, నీల్ నితీన్ ముఖేష్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నిజాయితీ పరుడైన రైల్వే టికెట్ కలెక్టర్ కు ఓ బిజినెస్ మ్యాన్ కు జరిగిన సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కింది.
ది నైట్ ఏజెంట్ సీజన్ 2 (నెట్ఫ్లిక్స్-23 జనవరి): ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం ఖాయం. ఇప్పటికే ఫస్ట్ సీజన్ సక్సెస్ నేపథ్యంలో రెండవ సీజన్ ను మరింత పకడ్బందిగా తెరకెక్కించారు.
శివరాపల్లి (అమెజాన్ ప్రైమ్ వీడియో-24 జనవరి): ఈ చిత్రం కుటుంబం, సంబంధాలు, సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో తెరకెక్కించారు.
హార్లెం సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో-22 జనవరి): ఇది ప్రముఖ వ్యక్తుల భార్యలు, స్నేహితురాళ్ల నాటకీయ జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది.
ది ట్రామా కోడ్ (నెట్ఫ్లిక్స్-24 జనవరి): కొరియన్ వెబ్ సిరీస్ వైద్యరంగంలోని మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది.
ది సాండ్ కాజిల్ (నెట్ఫ్లిక్స్-24 జనవరి): గ్రామీణ ఇరాకీ గ్రామంలో నీటి పంపింగ్ స్టేషన్ను మరమ్మతు నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈ వీకెండ్ లో చూసి ఎంజాయ్ చేయోచ్చు.
దీదీ (జియో సినిమా-26 జనవరి): ఈ చిత్రం 13 ఏళ్ల తైవానీస్ అమెరికన్ బాలుడి నేపథ్యంలో తెరకెక్కింది.
స్వీట్ డ్రీమ్ (డిస్నీ+ హాట్స్టార్-24 జనవరి): ఇద్దరు అపరిచితుల రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది.