ఐడెంటిటీ.. టొవినో థామస్,త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన ఐడెంటిటీ. అఖిల్ పాల్, అనాస్‌ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మలయాళీ మూవీ ఈ నెల 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
సింగ్ సింగ్.. కోల్‌మ్యాన్, క్లారెన్స్, సీన్ శాన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 31న స్ట్రీమింగ్ కు రానుంది.
పోతుగడ్డ.. పృథ్వీ, విస్మయ శ్రీ, శత్రు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘పోతుగడ్డ’. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది సీక్రెట్ ఆఫ్ ది షిలిదార్స్.. సాయి తమంకర్, రాజీవ్, ఆశిష్ విద్యార్థి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ‘ది సీక్రెట్ ఫ్ ది షిలిదార్స్. ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేసారు. ఈ నెల 31 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
డెన్ ఆఫ్ థీవ్స్ 2.. గెరార్డ్, ఓషే జాక్సన్ Jr నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ అవుతోంది.
పుష్ప2: ది రూల్.. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది స్టోరీ టెల్లర్..ప్యాన్ ఇండియా నటుడు పరేశ్‌రావల్, రేవతి ముఖ్యపాత్రలో నటించిన ‘ది స్టోరీ టెల్లర్’ సిరీస్ ను అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.