BJP Meetings: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్, ఘనంగా ఏర్పాట్లు

BJP Meetings: బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ మరింతగా పెంచిందా..అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికవుతోంది. 

ఇటీవలి కాలంలో మారుతున్న పరిణామాలతో బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని హైదరాబాద్‌లోనే జరపాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరగనున్నాయి. 

హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మూడ్రోజులపాటు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లకై ఆ పార్టీ జాతీయ కార్య నిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి కీలక నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.ఈ సమావేశాల నేపధ్యంలో ప్రధాని మోదీ రెండ్రోజులపాటు రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. అటు అమిత్ షా కూడా హైదరాబాద్‌లోనే మూడ్రోజులపాటు ఉండనున్నారు. నోవాటెల్ హోటల్‌లో 3 వందలమంది ప్రముఖుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also read: Charminar Mosque Prayers Demand : చార్మినార్‌ మసీదులో ప్రార్థనలకు అనుమతివ్వాలని డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Bjp National executive meeting will be held at hyderabad novatel hotel for 3 days
News Source: 
Home Title: 

BJP Meetings: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్

BJP Meetings: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్, ఘనంగా ఏర్పాట్లు
Caption: 
Hyderabad Novatel Hotel ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ వేదిక

మూడ్రోజులపాటు జరగనున్న సమావేశాలు, ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రముఖ నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరు

Mobile Title: 
BJP Meetings: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, June 1, 2022 - 23:27
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
55
Is Breaking News: 
No