Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

snake in mouth kamareddy video viral: పామును చూడగానే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాములు ఉన్నాయంటే, చాలా మంది ఆ ప్రాంతాలకు కూడా అస్సలు వెళ్లరు. కానీ కొంత మంది మాత్రం పాములతో ఆటలాడుతుంటారు. అడవులు, చెట్లు, దట్టమైన కొండ ప్రాంతాలలో పాములు ఎక్కువా కన్పిస్తుంటాయి. పంటపొలాల్లో కూడా పాములు కన్పిస్తుంటాయి. పాములకు చెందిన వీడియోలు తరచుగా  వార్తలలో ఉంటాయి. కొన్ని షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి.

 

పాములకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు కూడా పాములకు చెందిన వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.ఈ నేపథ్యంలో పాములకు చెందిన మరో వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..
 

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బాన్సువాడలోని దేశాయి పేటకు చెందిన  గంగారం, శివరాజులు పాములు పట్టుకుని జీవనం సాగిస్తుంటారు. అయితే.. తండ్రి గంగరాం చెప్పాడని, కొడుకు శివరాజ్ పామును నోట్లో పెట్టుకుని వీడియో తీస్తుంటాడు. అతడి పనుల్ని చూసి అక్కడివారు వారిస్తుంటారు.

ఇంతలో పాము నోట్లో ఉండగా.. శివరాజ్ నాలుకపై కాటు వేస్తుంది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆస్పత్రిలోకి తీసుకెళ్లేసరికి అతను, చనిపోయాడని కూడా వైద్యులు చెప్పేస్తారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Read more: Ola auto driver: రెచ్చిపోయిన ఓలా డ్రైవర్.. రైడ్ క్యాన్షిల్ చేసిందని యువతిని కొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..

దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఇదేం పిచ్చి పనంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఆ యువకుడి తండ్రిని కూడా తిట్టిపోస్తున్నారు. పాములతో చెలగాటం ఏంటని కూడా ఫైర్ అవుతున్నారు.
 

Section: 
English Title: 
young man from kamareddy banswada lost life while selfie video with venomous cobra in mouth video goes viral pa
News Source: 
Home Title: 

Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
 

Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
Caption: 
snakevideo(file)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

పామును నోట్లో పెట్టుకుని వీడియో..

తిట్టిపోస్తున్న నెటిజన్లు..
 

Mobile Title: 
Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన..
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Friday, September 6, 2024 - 13:30
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
23
Is Breaking News: 
No
Word Count: 
188