Singareni Company: సింగరేణిపై కేంద్రం కుట్రలను కేసీఆర్ తిప్పికొట్టారు

BRS MLC Kalvakuntla Kavitha about Singareni: హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని, అందుకే సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని.. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో పోరాడి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు.

సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం రోజున టీబీజీకేఎస్ సంఘం నాయకులు కవితను హైదరాబాద్ లో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... " తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరచిపోరు " అని అన్నారు. అవకాశం ఉన్న ప్రతీసారి సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ వారికి మేలు చేస్తూనే ఉన్నారు అని అన్నారు. సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 18 శాతం బోనస్ ఉండగా.. 2022 నాటికి 30 శాతానికి పెంచామని, ఈ సారి అది మరింత పెంచి 32 శాతానికి పెంచడం పట్ల కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాటు పడుతుందని, తమ పార్టీ సింగరేణి సంస్థతో పాటు సింగరేణి కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తనని కలిసిన కార్మిక సంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య, టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు.

సింగరేణి ఎన్నికల షెడ్యూల్ విడుదల
సింగరేణి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. అక్టోబర్ 09న విత్ డ్రాయల్స్ కి అనుమతిస్తారు. అక్టోబర్ 10న ఎన్నికల గుర్తుల కేటాయించడం జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టులో దాఖలైన పిటిషన్ ని కోర్టు కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం డిప్యూటీ లేబర్ కమిషన్ నిర్వహించిన సమావేశానికి బిఎంఎస్, ఏఐటీయూసీ కార్మిక సంఘాలు హాజరై తమ అభిప్రాయాలు వినిపించాయి. సింగరేణి ఎన్నికల నిర్వహణపై మెయిల్ ద్వారా మిగితా కార్మిక సంఘాలు తమ అభిప్రాయాలను తెలిపాయి.

English Title: 
BRS MLC Kalvakuntla Kavitha about Singareni Company employees and BRS partys stand towards Singareni
News Source: 
Home Title: 

Singareni Company: సింగరేణిపై కేంద్రం కుట్రలను కేసీఆర్ తిప్పికొట్టారు

Singareni Company: సింగరేణిపై కేంద్రం కుట్రలను కేసీఆర్ తిప్పికొట్టారు
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Singareni Company: సింగరేణిపై కేంద్రం కుట్రలను కేసీఆర్ తిప్పికొట్టారు
Pavan
Publish Later: 
No
Publish At: 
Thursday, September 28, 2023 - 04:44
Request Count: 
16
Is Breaking News: 
No
Word Count: 
260