అందరూ లడ్డూలను తినేందుకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీటిని తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణం అతిగా ఉంటుంది కాబట్టి తినడం వల్ల అనేక వ్యాధుల బారిన పడొచ్చు.
';
కానీ కొన్ని చిరుధాన్యాలతో చేసిన లడ్డూలు రోజు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా రాగి పిండితో తయారు చేసిన లడ్డు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
';
రాగి పిండితో చేసిన లడ్డూలలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈరోజు తిను చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
';
మీరు కూడా రాగి పిండి లడ్డూలను ఇంట్లో తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.
';
కావలసిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, నెయ్యి - 1/2 కప్పు, బెల్లం తురుము - 1/2 కప్పు, యాలకుల పొడి - 1/2 టీ స్పూన్, జీడిపప్పు, బాదం - కావలసినన్ని.
';
ముందుగా ఈ లడ్డును తయారు చేసుకోవడానికి.. ఒక స్టవ్ పై కళాయి పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో నెయ్యి వేడి చేసి రాగి పిండిని దోరగా వేయించండి.
';
ఇలా దూరంగా వేయించిన తర్వాత పిండిని వేరే కప్పులోకి తీసుకొని.. అదే బౌల్లో మరి కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం వేసుకుని బాగా వేపుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం వేసుకొని పాకం వచ్చేంతవరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్సీ కొట్టుకొని అందులో వేసుకోండి.
';
డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అందులోనే యాలకుల పొడి, రాగి పిండి వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా లడ్డూలుగా కట్టుకొని పక్కన పెట్టుకోండి. అంతే రాగి పిండి లడ్డూలు తయారైనట్టే..
';
రాగి పిండి లడ్డూలు రోజు తింటే ఐరన్ లోపం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల విటమిన్స్ లోపం కూడా తగ్గుతుంది.