మనలో కొంతమందికి మధ్యరాత్రి మెలకవ వస్తుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. దీంతో ఒత్తిడి,చిరాకు వస్తుంది.
మధ్యరాత్రి మెలకువ వచ్చిన తర్వాత తిరిగి నిద్రించాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
కొంతమందికి గదిలో లైట్లన్నీ ఆర్పేస్తేనే నిద్ర పడుతుంది. మీకు అలాంటి అలవాటు ఉంటే తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.
మధ్యరాత్రి మెలకువ వచ్చినప్పుడు గడియారంలో సమయం చూసుకోకుండా అలాగే నిద్రపోవాలి. సమయం చూస్తే ఒత్తిడికి గురవుతారు.
కొంతమంది పడుకునే ముందు చదువుకోవడం, సంగీతం వినడం చేస్తారు. మధ్యరాత్రి మెలకువ వచ్చి నిద్రపట్టకుంటే పుస్తకాలు, లేదా మ్యూజిక్ వినండి.
రాత్రి నిద్రించే ముందు మంచి పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.