గుండెను రక్షించే లడ్డూలు.. రోజు తిని చూడండి..

Dharmaraju Dhurishetty
Feb 08,2025
';

శనగపప్పుతో చేసిన ఆహార పదార్థాల్లో ప్రోటీన్ తో పాటు ఫైబర్ ఐరన్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తింటే ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.

';

చాలామంది వ్యాయామాలు చేసేవారు ప్రతిరోజు ఈ పప్పుతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు.

';

అలాగే చాలామంది శనగపప్పుతో లడ్డూలను కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజూ తింటే బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ప్రతిరోజు ఉదయాన్నే శనగపప్పుతో తయారుచేసిన లడ్డు తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.

';

ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడే వారికి ఈ లడ్డు ఔషధంలా పనిచేస్తుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

';

అయితే మీరు కూడా ఈ లడ్డును ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..

';

శనగపప్పు నెయ్యి లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు - 1 కప్పు, నెయ్యి - 1/2 కప్పు, బెల్లం లేదా డేట్స్ - 1/2 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: ముందుగా ఈ లడ్డుని తయారు చేసుకోవడానికి శనగపప్పును నీటిలో వేసుకొని బాగా శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత తడి ఆరేంతవరకు బాగా ఎండబెట్టుకోండి.

';

పప్పు బాగా ఎండిన తర్వాత పిండిలా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఓ పెద్ద బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకోండి. అందులో తగినంత నెయ్యి వేసి వేడి చేసుకోండి.

';

ఇలా నెయ్యిని బాగా వేడి చేసుకున్న తర్వాత అందులో శనగపిండిని వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది. బాగా వేపుకున్న తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

';

అలాగే ఖర్జూరాలను తీసుకొని వాటిలో నుంచి గింజలను తీసి పక్కనపడేసి బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.

';

బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లా తయారు చేసుకొని గాజు సీసాలో భద్రపరచుకోండి. అంతే సులభంగా లడ్డూలు తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story