హై ప్రోటీన్‌ టిఫిన్‌ రెసిపీ.. పిల్లలకు తప్పకుండా పెట్టండి..

Dharmaraju Dhurishetty
Jan 28,2025
';

చాలా మంది అన్ని రకాల వడలను తిని ఉంటారు. కానీ అలసంద వడల రెసిపీ ట్రై చేశారా?

';

అలసందల్లో ప్రోటీన్‌తో పాటు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి రోజు సలాడ్స్‌లో తీసుకోవడం చాలా మంచిది.

';

అలసందలతో బజ్జీతో పాటు వడలను కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

మీరు కూడా అల్పాహారంలో హై ప్రోటీన్ అలసంద వడలను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

అలసంద వడలకు అవసరమైన పదార్థాలు: అలసందలు (బొబ్బర్లు) - 1 కప్పు, చిటికెడు బేకింగ్ సోడా, ఉప్పు - రుచికి తగినంత

';

అవసరమైన పదార్థాలు: కారం - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా తరిగిన, నూనె - వడలు వేయడానికి తగినంత

';

తయారీ విధానం: అలసంద వడలను తయారు చేసుకోవడానికి ముందుగా అలసందలను కనీసం 6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోండి.

';

బాగా నానిన అలసందలను మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోండి.

';

అదే మిశ్రమంలో బేకింగ్ సోడా, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

ఆ తర్వాత ఓ ముకుడు పెట్టుకుని అందులో నూనెను వేసి బాగా వేడి చేసి.. పిండిని వడల్లా తయారు చేసుకుని బాగా వేపుకోండి.

';

ఇలా వేపుకున్న తర్వాత పెరుగుతో సర్వ్ చేసుకుంటే మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందుతారు.

';

VIEW ALL

Read Next Story