గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ట్యాబ్లెట్లకు బదులుగా ఈ మజ్జిగ తాగండి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
మసాలా మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని సుగంధ ద్రవ్యాలు అజీర్ణ సమస్యలను నివారిస్తాయి.
పెరుగు – 1 కప్పు,నీరు – 1½ కప్పు, జీలకర్ర పొడి – ½ టీస్పూన్,అల్లం తురుము – ½ టీస్పూన్ , పుదీనా ఆకులు – కొన్ని, కరివేపాకు – కొన్ని , కొత్తిమీర- కొన్ని, ఉప్పు – రుచికి తగినంత
ముందుగా పెరుగు, నీటిని బాగా మిక్స్ చేసి మజ్జిగగా తయారు చేసుకోవాలి. అందులో జీలకర్ర పొడి, అల్లం తురుము వేసి కలపాలి. తరిగిన పుదీనా, కరివేపా, కొత్తిమీర కచ్చా కచ్చా గా వేసి బాగా మిక్స్ చేయాలి. చల్లగా ఉండేలా కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తాగాలి.
మజ్జిగలోని ప్రొబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచేలా సహాయపడతాయి. ఇది పొట్టలో ఉండే చేసి గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.
రోజూ భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అజీర్ణం సమస్యలు తగ్గుతాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.