Magnesium Foods: మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ ఫుడ్స్ తింటే ఊహించని ప్రయోజనాలు
మెగ్నీషియం అనేది శరీరం పనితీరు, కండరాల సమతుల్యతకు ఉపయోగపడుతుంది
మెగ్నీషియం లోపిస్తే కండరాల ఆరోగ్యంలో సమస్య ఎదురౌతుంది
శరీరాన్ని నియంత్రించడం, పనితీరులో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మెగ్నీషియం ఉండే పదార్ధాలను రోజువారీ డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది
మెగ్నీషియం పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ ఏంటనేది తెలుసుకుందాం
ఆకు కూరల్లో మెగ్నీషియం పెద్దఎత్తున ఉంటుంది. పాలకూరలో శరీర అవసరాలకు కావల్సినంత మెగ్నీషియం ఉంటుంది
పాలకూరను కూర రూపంలో లేదా సూప్ రూపంలో తినవచ్చు
ఆకు కూరలతో పాటు బాదం, జీడిపప్పు, మఖనా, మునక్కాయ తీసుకుంటే మెగ్నీషియం కావల్సినంత లభిస్తుంది
డార్క్ చాకొలేట్‌లో కూడా మెగ్నీషియం పెద్ద ఎత్తున ఉంటుంది