బేసన్‌తో చేసిన ఈ ఆమ్లెట్ గుడ్డు లేకుండానే.. కోడి గుడ్డు ఆమ్లెట్ అంత రుచిని ఇస్తుంది. అంతేకాదు ఈ ఆమ్లెట్ పోషకవిలువలతో నిండి ఉంటుంది.
బేసన్ (సెనగపిండి) – 1 కప్పు, ఉల్లిపాయ – 1..సన్నగా తరిగినది, టమాట – 1..సన్నగా తరిగినది, క్యారెట్ – ¼ కప్పు..తురిమినది, కొత్తిమీర – 2 టీస్పూన్లు , పచ్చిమిర్చి – 1, సన్నగా తరిగినది, మిరియాల పొడి – ½ టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నీరు – మిశ్రమం సిద్ధం చేస
బేసన్‌లో అన్ని కూరగాయలు, మిరియాల పొడి, ఉప్పు.. కొద్దిగా నీరు పోసి కోరి గుడ్డు మిశ్రమంలో కలుపుకోవాలి.
తయారైన మిశ్రమాన్ని వేడైన పెనం మీద పోసి, నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.
ఈ ఆమ్లెట్ ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండి బరువు తగ్గే వారికి ఉత్తమమైన ఆహారం.
చట్నీ లేదా టమాటో సాస్‌తో వేడి వేడి బేసన్ ఆమ్లెట్ తింటే రుచి అదిరిపోతుంది.
అంతేకాదు ఈ ఆమ్లెట్ ని అన్నంలో నంచుకొని తింటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది.