బరువు పెరగడం నుండి కాపాడుకోవడానికి కొన్ని ఆహారాలను తప్పించుకోవడం చాలా ముఖ్యం.
కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేయండి. అంతేకాదు ఎక్కువ స్వీట్ గా ఉందే.. ఆహారాలను దూరం పెట్టండి.
ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువ కొవ్వు కలిగి ఉంటాయి, ఇవి త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే వీటిని అసలు తినకపోవడం మంచిది.
బ్రెడ్, పాస్తా.. లాంటివి ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినకపోవడం ఉత్తమం.
ప్రాసెస్డ్ మాంసాలు కూడా అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కావున ఎప్పుడూ ఫ్రెష్ మీట్ తీసుకొని తినడమే మేలు.
మీరు బరువు తగ్గడానికి పచ్చి కూరగాయలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, చిరుధాన్యాలు వంటివి తినడం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా పైన చెప్పిన ఐదు పదార్థాలు తినకుండా ఇంకా ఏమి తిన్నాకాని మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువ.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.