Nutrition Tips In winter : రోజూ ఈ ఆహారం తీసుకుంటే చలికాలంలో సూపర్ హెల్దీగా ఉండొచ్చు

Bhoomi
Nov 29,2024
';

చలికాలం

చలికాలం వచ్చిందంటే ప్రజలు చలితో వణికిపోతుంటారు. బయట తిరగడానికి భయపడుతుంటారు. ఉదయం ఏడు దాటినా సూర్యుడు కనిపించడు.

';

వ్యాధులు

చలికాలంలో జ్వరం, జలుబు, పొడి బారే చర్మం, వైరస్, బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతాయి. పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

';

పౌష్టికాహారం

చలికాలంలో పౌష్టికాహారంతోనే సంపూర్ణం ఆరోగ్యం ఉంటుంది. పదేళ్లలోపు పిల్లలకు డ్రైఫ్రూట్స్ లడ్డూలు, భోజనంతోపాటు రెండు పూటల ఉడకబెట్టిన గుడ్లు తినిపించాలి.

';

ఆకుకూరలు

ఐరన్, కాల్షియం ఉండే కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. పిల్లలకు నువ్వుల ముద్దలు తినిపిస్తే శరీరానికి కాల్షియం, ఖనిజ లవణాలు అందుతాయి.

';

పోషకాలతో కూడిన ఆహారం

15 నుంచి 30ఏళ్ల వయసులో పోషకాలతో కూడిన ఆహారం తినిపించాలి. తాజా కూరగాయలు, కోడిగుడ్డు, నీరు ఎక్కువగా తాగించాలి. బ్రౌన్ రైస్ తో వండిన అన్నం శరీరానికి మంచి పోషకాలను ఇస్తుంది.

';

పండ్లు

చలికాలంలో ఏ వయస్సువారైనా సరే జామ, కమలాలు, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి, చిటికెడు పసుపుతో పాటు పాలు, అరటిపండ్లు పొట్టను క్లీన్ చేస్తాయి.

';

ముక్కు దిబ్బడ

చిన్నారుల్లో తరచుగా ముక్కు దిబ్బడ ఉంటే ఆవిరి పడుతుండాలి. గొంతునొప్పి ఉంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పులికించాలి.

';

రాత్రి భోజనంలో నూనె

బ్రౌన్ రైస్ తో వండిన అన్నం శరీరానికి పోషకాలను అందిస్తుంది. వ్రుద్ధులు రాత్రి భోజనంలో నూనె తగ్గించుకోవాలి. త్వరగా తిని నిద్రించాలి.

';

VIEW ALL

Read Next Story