మొత్తంగా 60 ప్లస్ ఏజ్ లో వరుస సక్సెస్ లతో హీరోగా.. ఎమ్మెల్యేగా.. క్యాన్సర్ హాస్పటల చైర్మన్ గా.. అన్ స్టాపబుల్ హోస్ట్ గా దూసుకుపోతున్న బాలయ్య కీర్తి కిరీటంలో పద్మభూషణ్ చేరింది.
అఖండ,వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత తాజాగా ‘డాకు మహారాజ్’ వరుసగా 4వ సక్సెస్ అందుకున్నాడు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ బాలయ్య కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బాలయ్య పనైపోయిందన్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సింహ గర్జన చేసాడు.
బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నరసింహనాయుడు’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ చిత్రాల్లో ఇదో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది.
జానపదాలు కనుమరుగు అవుతున్న సందర్బంలో బాలయ్య రాకుమారుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవ ద్వీపం’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఢిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. తెలుగులో పోలీస్ బ్యాక్ డ్రాప్ చిత్రాల్లో ఈ సినిమాకు తప్పక స్థానం ఉంటుంది.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణకుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆదిత్య 369’. అంతేకాదు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం పలు రికార్డ
కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన చిత్రం ‘ముద్దుల మావయ్య’. తెలుగులో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
నటుడిగా నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. తొలి చిత్రంలోనే తాతమ్మ కలను నెరవేర్చే ముని మనవడి పాత్రలో టైటిల్ రోల్ చేయడం విశేషం.