New York to New Delhi: న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. మీరు ప్రయాణిస్తున్ను విమానం న్యూఢిల్లీకి కాదు, రోమ్‌కి వెళ్తోందని ప్రయాణికులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బాంబు బెదిరింపు రావడంతో అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన న్యూయార్క్-న్యూఢిల్లీ విమానాన్ని రోమ్ కు మళ్లించారు. న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 8.14 గంటలకు విమానం బయలుదేరింది. ఇది ఢిల్లీకి వచ్చే బదులు ఆదివారం సాయంత్రం రోమ్ కు వెళ్లింది. ఇటలీ వాయుసేన విమానం రక్షణగా వస్తుండగా అది అక్కడ సురక్షితంగా దిగిందని..ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని సంబంధిత విమానయాన సంస్థ తెలిపింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం నంబర్ AA292 ఫిబ్రవరి 22న న్యూయార్క్‌లోని JFK అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అది ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది, కానీ దాని మార్గాన్ని మళ్లించి రోమ్‌కు పంపారు. 'Flightradar24.com' ప్రకారం, విమానం త్వరలో రోమ్‌లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న విమాన స్థితి ప్రకారం, ఫిబ్రవరి 22న రాత్రి 8:14 గంటలకు న్యూయార్క్‌లోని JFK విమానాశ్రయం నుండి AA292 విమానం బయలుదేరింది. ఇది స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ఇటలీలోని ఫియుమిసినోలోని లియోనార్డో డా విన్సీ రోమ్ ఫియుమిసినో విమానాశ్రయానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
విమానం స్టేటస్ రూట్ మళ్లింపుకు గల కారణానికి సంబంధించి అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చేసిన విచారణలకు ఇంకా సమాధానం రాలేదు.
🚨 INSIDE THE ESCORT MISSION: This stunning footage from an Italian Air Force Eurofighter shows American Airlines #AA292 intercepted mid-air and escorted to Rome-Fiumicino after a bomb threat forced an emergency diversion.
🎥 Must-see footage ⬇️ #AA292 #Breaking NewYork-Delhi pic.twitter.com/rTTdQiLIAY
— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) February 23, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి