వేసవి వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ అదే పనిగా టీ తాగే అలవాటుంటే వేసవిలో నియంత్రించుకోవల్సిందే
సాధారణంగా మన దేశంలో ప్రతి ఒక్కరూ తిండిప్రియులే. అందులోనూ టీ అంటే పడిచస్తారు. లెక్కలేనంతగా తాగేస్తుంటారు
చాలామంది ఉదయం లేవగానే టీతో ప్రారంభిస్తారు. టీ నిస్సందేహంగా తాజాదనం, ఎనర్జీ ఇస్తుంది. అందుకే రోజుకు 3-4 సార్లు టీ తాగుతుంటారు
కొంతమందైతే రోజుకు 5-8 సార్లు కూడా టీ తాగుతుంటారు. కానీ వేసవి కాలంలో కూడా ఇలానే చేస్తే మంచిది కాదు.
ఎందుకంటే టీతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే దుష్పరిణామాలున్నాయి. టీ అతిగా తాగడం వల్ల గ్యాస్, అజీర్తి, పుల్లటి తేన్పులు వంటి సమస్యలు రావచ్చు.
టీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇందులో కలుపుకునే పాలు, పంచదార వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి
టీ తాగకపోతే చాలామందికి అసౌకర్యంగా, ఒత్తిడిగా, తలనొప్పిగా ఉంటుంది. కానీ వేసవిలో నియంత్రించుకోవాలి
టీలో ఉండే కెఫీన్, ట్యానిన్ నిద్రావస్థను పాడు చేస్తుంది. ఫలితంగా రాత్రి నిద్రలో ఆటంకం కలుగుతుంది.
అయితే వేసవిలో ఎన్ని కప్పుల టీ తాగాలనే సందేహం మీలో కలుగుతుంటుంది. ఆరోగ్య నిపుణులు ప్రకారం వేసవిలో రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ టీ మంచిది కాదు.