పాలకూరతో చేసిన ఆహారాలు రోజు తింటే విటమిన్ ఏతో పాటు సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం చాలా మంచిది.
';
అలాగే పాలకూరలో ఉండే వివిధ పోషకాలు, పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
';
ఈ ఆకుల్లో క్యాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి రోజు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి.
';
బీపీ సమస్యలు ఉన్నవారు ఈ ఆకులతో తయారుచేసిన రసాన్ని రోజు ఉదయాన్నే తాగితే అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
';
బిపి సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
';
పదార్థాలు: పాలకూర ఆకులు - 2 కప్పులు, నీరు - 1 కప్పు, నిమ్మరసం - 1/2 నిమ్మకాయ, తేనె - 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్క - చిన్న ముక్క
';
తయారీ విధానం: ముందుగా పాలకూర ఆకులను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
';
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. మిక్సీ జార్లో కాస్ట్ అంత నిమ్మరసం, తేనె, అల్లం, నీరు వేసుకొని మిక్సీ పట్టుకోండి.
';
ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని గాజు గ్లాసులోకి వడకట్టుకొని.. రోజు ఉదయాన్నే పరిగడుపున తాగండి.
';
ఇలా రోజు తాగితే అధిక రక్తపోటుతో పాటు గుండె సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయి.