ఈ స్వీట్ తింటే.. గుండె అద్భుతంగా పనిచేస్తుంది..

Dharmaraju Dhurishetty
Feb 06,2025
';

తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డ్రై ఫ్రూట్స్ను అల్పాహారంలో భాగంగా చేర్చుకోవాల్సి ఉంటుంది.

';

డ్రై ఫ్రూట్స్‌లో ఉండే వివిధ రకాల పోషకాలతో పాటు ఖనిజాలు గుండెను శక్తివంతంగా ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

అలాగే రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం, సాయంత్రం డ్రై ఫ్రూట్స్ తినాల్సి ఉంటుంది.

';

కొంతమంది పిల్లలు నేరుగా డ్రైఫ్రూట్స్ తినేందుకు అంతగా ఇష్టపడరు.. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాం.. అదేంటో కాదు.. డ్రై ఫ్రూట్ రోల్..

';

డ్రై ఫ్రూట్ రోల్ కావలసిన పదార్థాలు: ఖర్జూరం - 1 కప్పు, అంజీర్ - 1/2 కప్పు, బాదం - 1/4 కప్పు, పిస్తా - 1/4 కప్పు, జీడిపప్పు - 1/4 కప్పు

';

కావలసిన పదార్థాలు: ఎండు ద్రాక్ష - 1/4 కప్పు, కొబ్బరి తురుము - 1/4 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, నెయ్యి - 1 టేబుల్ స్పూన్

';

తయారీ విధానం: ఈ రూల్స్ ను తయారు చేసుకునేందుకు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఖర్జూరం, అంజీర్, జీడిపప్పు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

';

ఇలా కట్ చేసుకున్న ముక్కలను స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకొని బాగా వేపుకొని పక్కన తీసుకోండి.

';

అన్ని వేగిన తర్వాత ఖర్జూర, అంజీర్ ముక్కలు వేసి మరికొద్ది సేపు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి.

';

ఖర్జూర మెత్తపడేంతవరకు అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని రోల్ లా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న రోల్‌ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని డబ్బాలో భద్రపరచుకోండి.

';

VIEW ALL

Read Next Story