నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. తయారీ చాలా సులభం..

Dharmaraju Dhurishetty
Nov 25,2024
';

ఉడకబెట్టిన కోడిగుడ్డులో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అయితే దీనితో తయారుచేసిన పచ్చడిని తినడం వల్ల కూడా బోలెడు లాభాలు కలుగుతాయి.

';

మీరు కూడా ఇంట్లోనే ఏం చక్కగా కోడుగుడ్డు పచ్చడిను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కోడిగుడ్డు పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు - 6, ఉప్పు - రుచికి సరిపోయేంత, పసుపు - 1/2 టీస్పూన్, కారం - రుచికి సరిపోతుంది (ఎండుమిరపకాయ పొడి లేదా కశ్మీర్ ఎండుమిరపకాయ పొడి)

';

కావలసిన పదార్థాలు: నూనె - 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 5-6, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి - 1 టీస్పూన్, జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, గరం మసాలా - 1/4 టీస్పూన్, నిమ్మరసం - 1 నిమ్మకాయ

';

తయారీ విధానం: ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక పాత్రలో నీటిని తీసుకోవాలి. అందులో కోడిగుడ్లు వేసి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.

';

ఆ తర్వాత మరో తీసుకొని దానిని స్టవ్ పై పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి వేడి చేసుకోండి.

';

ఇలా వేడి చేసుకున్న నూనెలో జీలకర్ర వేసి పగలగొట్టి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.

';

బాగా వేగిన తర్వాత ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత చివరగా కారం, పసుపు వేసుకొని అందులో కోడిగుడ్లను వేసి బాగా వేపుకోండి.

';

కోడిగుడ్లు నూనెలో ఉడికి గట్టి పడిన తర్వాత కావలసినంత నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే సులభంగా కోడిగుడ్డు పచ్చడి రెడీ అయినట్లే.

';

VIEW ALL

Read Next Story