కరోనా నుంచి అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సదుపాయం కల్పించాయి.
దీంతో చాలా మంది తమ ఇళ్ల నుంచి ఆఫీసుల పనులు చేసుకుంటున్నారు.
గంటల తరబడి ఒకే చోట కూర్చొవడం వల్ల నడుము నొప్పి సమస్యలు వస్తున్నాయి.
ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి గంటకు ఒక ఐదునిమిషాలు లేచి నడవాలి.
ఒకే పొశ్చర్ లో కాకుండా.. కాస్తంత శరీరంను కదిలిస్తు ఉండాలి.
నడుముకు సపోర్ట్ ఉండేలా చైర్, పిల్లోలు ఉండేలా చూసుకొవాలి.
నడుము ఎక్కువగా ఉన్న వాళ్లు డాక్టర్ లను వెంటనే సంప్రదించాలి.