షుగర్ ఉన్నవారికి ఈ పచ్చడి వరం.. రోజు తింటే మధుమేహానికి చెక్..

Dharmaraju Dhurishetty
Jan 18,2025
';

కాకరకాయ నిల్వ పచ్చడిని రోజు ఉదయాన్నే మధుమేహం ఉన్నవారు అల్పాహారంతో తీసుకుంటే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు సహాయపడతాయి.

';

కాకరకాయలో ఉండే కొన్ని శక్తివంతమైన ఔషధ మూలకాలు షుగర్ ను కంట్రోల్ చేసేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. దీనివల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

';

మధుమేహం ఉన్నవారు ఈ కాకరకాయ పచ్చడిని ఇంట్లో కూడా ఎంతో సులభంగా తయారు చేసుకొని తినొచ్చు. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - 1/2 కిలోలు, నూనె - వేయించడానికి సరిపడా, చింతపండు - 100 గ్రాములు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి - 1 టేబుల్ స్పూన్

';

కావలసిన పదార్థాలు: ఆవాలు - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్, పసుపు - 1/2 టీ స్పూన్, వెల్లుల్లి - 10 రెబ్బలు, ఇంగువ - చిటికెడు

';

తయారీ విధానం: ముందుగా కాకరకాయలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని నీరు ఆరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. మీరు ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి.

';

స్టౌవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి బాగా వేడి చేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని బంగారు రంగు వచ్చేంతవరకు బాగా వేపుకోండి.

';

బాగా వేగిన కాకరకాయలను పక్కన తీసుకొని.. అదే బౌల్లో కాస్తంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేపుకోండి.

';

అన్ని వేపుకున్న తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులోనే కాకరకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్స్ చేసుకోండి.

';

ఇవన్నీ వేసుకున్న తర్వాత నూనె పైకి తేలేంతవరకు బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత చల్లబరుచుకుని గాజు సీసాలో భద్రపరచుకోండి. అంతే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story