ముఖ్యంగా వేసవిలో మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు సొరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
వేసవిలో చాలామందిలో డీహైడ్రేషన్ సమస్య కారణంగా తల తిరగడం ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సొరకాయ రసం ప్రభావంతంగా పనిచేస్తుంది.
ప్రతిరోజు సొరకాయ రసం తాగడం వల్ల కూడా ఎముకలను దృఢంగా ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే క్యాల్షియం, జింక్ ఎముకలను దృఢంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.
సొరకాయ రసంలో సోడియంతో పాటు ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు అధిక మోతాదులు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు.
ప్రతిరోజు వేసవిలో సొరకాయ రసం తాగడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా రక్తపోటును కూడా సులభంగా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సొరకాయ రసం తాగడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. దీంతో పాటు రాలిన జుట్టు కూడా తిరిగి వస్తుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఈ రసాన్ని తాగండి.
వేసవి సమయాల్లో చాలామందిలో మానసిక ఒత్తిడి సమస్యలు ఉంటాయి. అయితే ఈ సమస్యలతో బాధపడే వారికి కూడా సొరకాయ రసం ప్రభావంతంగా పనిచేస్తుంది.
ముఖ్యంగా సొరకాయ రసంలో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.