ఉదయాన్నే ఎటువంటి టిఫన్ తింటే మంచిది అని మీరు ఆలోచిస్తూ ఉంటే.. వెంటనే ఈ పాలకూర..మిల్లెట్ పొంగలిని మీ డైట్ లో చేర్చుకోండి.
మిల్లెట్లో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తుంది.
పాలకూరలో ఉన్న విటమిన్లు, మినరల్స్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.
మిల్లెట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
పాలకూరలో ఐరన్, మిల్లెట్లో పోటాషియం అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
మిల్లెట్, పాలకూర రెండింటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచుతుంది.
రోజూ ఈ పొంగలి తింటే మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
పాలకూర, పెసర పప్పు, కొర్రలు, కొద్దిగా వేసి నీళ్లల్లో మూడు విజన్స్ వచ్చేదాకా ఉడక పెట్టుకోండి. ఒక క్లాస్ కొర్రలకి రెండు గ్లాసుల నీళ్లు పోయండి. మూడు విజిల్స్ వచ్చిన తరువాత కుక్కర్ మూత తీసి.. ఉప్పు, నెయ్యి వేసి కలుపుకోండి. అంటే ఎంతో ఆరోగ్యవంతమైన పాలకూర పొంగల్