ప్రధాని నరేంద్ర మోడీ సాధారణంగా గుజరాతి వంటకాలను ఇష్టపడతారు. ఆయనకు ఇష్టమైన వాటిలో మొరింగా చపాతి అత్యంత ముఖ్యమైనది.
మొరింగా అంటే మునగాకు అని అర్థం మునగాకుతో చేసిన చపాతి తినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడుతుంటారు.
ఆయన తినే డైట్లో తప్పనిసరిగా ఈ మునగాకు చపాతీ ఉంటుంది. గుజరాతి సాంప్రదాయ వంటకంగా ఇది ప్రసిద్ధి చెందింది.
దీని తయారీ విధానం కూడా చాలా సులభం. మునగాకును ఉడకబెట్టుకొని గుజ్జుగా చేసుకోవాలి.
ఆ తర్వాత దీన్ని గోధుమ పిండిలో కలిపి చపాతీలుగా ఒత్తుకొని కాల్చుకొని తిన్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది.
చపాతీలు కాల్చే సమయంలో నూనె బదులుగా నెయ్యి వాడినట్లయితే మరింత రుచికరంగా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మునగాకులో పెద్ద మొత్తంలో కాల్షియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బీపీ షుగర్ వంటి వ్యాధులను తగ్గించేందుకు సహాయపడతాయి.
మునగాకులో పెద్ద మొత్తంలో కాల్షియం లభిస్తుంది. 20 గ్లాసుల పాలల్లో లభించే కాల్షియం కేవలం ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడిలో లభిస్తుంది.
ఈ మునగాకు చపాతీలను ఆలుగడ్డ కూరతో కానీ చట్నీతో కానీ తినవచ్చు.
మునగాకు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి.