మిల్లెట్స్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.
మిల్లెట్స్, ఆకుకూరలతో చేసిన పొంగలి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ పొంగలిలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
బియ్యం బదులు కొర్రలు రెండు క్లాసులు నానబెట్టుకోండి. మరోపక్క ఆకుకూరని బాగా ఉడకపెట్టి మెత్తగా చేసుకొని.. మామూలు పొంగలి లాగానే.. బియ్యం పెసరపప్పుతో పాటు ఈ ఆకుకూర మిశ్రమాన్ని కూడా వేసుకొని పొంగలి చేసుకోండి.
చివరగా పోపుకి అలాగే రుచికి నూనె బదులు కొద్దిగా నెయ్యి వేసుకోండి.
ఈ రెసిపీ రోజూ ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం బదులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా, శక్తి కూడా అందిస్తుంది.
తక్కువ కొలెస్ట్రాల్‌తో ఆరోగ్యవంతమైన జీవనశైలికి మిల్లెట్ పొంగలిని మీ డైట్ లో చేర్చుకోవడం ఎంతో ఉత్తమమైన పని.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.