పల్లీల చట్నీ తిని బోర్ కొడుతుందా..? అయితే ఇడ్లీ,దోశల్లోకి ఎంతో ఆరోగ్యకరమైన ఈ పుదీనా చట్నీ ట్రై చేయండి.
అరకప్పు పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర.
ముందుగా పుదీనా, కొత్తిమీరను శుభ్రంగా కడిగి, మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా దీనిని తిరగమాత పెట్టుకోవాలి.
ఈ పచ్చడిలో ఉండే పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, అజీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.
కొత్తిమీరలో ఉన్న విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పుదీనా, కొత్తిమీర కలిపిన ఈ చట్నీ మీ బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.
ఈ పచ్చడిని దోశ, ఇడ్లీ, లేదా అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిని అందిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.