ప్రస్తుతం ఎంతోమంది ఆయాస సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలి అంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తాగి చూడండి.
శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే బీట్రూట్, పుదీనా, కీరా కలిపిన ఈ జ్యూస్‌ను తాగడం అలవాటు చేసుకోండి.
కీరాలో 90% పైగా నీరు ఉండటంతో శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి సున్నితమైన హైడ్రేషన్‌ను అందిస్తుంది.
బీట్రూట్లో నైట్రేట్లు సమృద్ధిగా ఉండటంతో ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, శక్తి స్థాయులను పెంచుతుంది. వర్క్అవుట్ ముందు తాగితే మరింత శక్తి లభిస్తుంది.
పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, తేలికపాటి నాచురల్ ఆయిల్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, శరీరానికి చురుకుదనాన్ని అందిస్తాయి.
తేనె జ్యూస్‌లో కలిపితే రుచి పెరగడంతో పాటు ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. శక్తిని త్వరగా అందించే నేచురల్ ఎనర్జీ బూస్టర్ ఇది.
బీట్రూట్, పుదీనా, కీరా కలిపిన ఈ జ్యూస్‌ను తాగితే శరీరం ఫ్రెష్‌గా ఉండి, బలమైన శక్తిని అందిస్తుంది. మోడీ తిని కలిపి మిక్సీలో వేసుకొని చివరిగా కావాలంటే కొద్దిగా పాలు పోసుకోండి. ఆ తరువాత ఇందులో తేనె వేసి తాగండి. ఈ జ్యూస్ మీకు ఎంతో శక్తినిస్తుంది
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.