Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వానలు పడుతున్నాయి.
Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు బలపడటంతోపాటు ఉపరితల ఆవర్తనం ప్రభావం అధికంగా ఉంది. దీంతో రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపోర్లు ప్రవహిస్తున్నాయి. చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యాకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.