MLC Kavitha: సీఎం ఢిల్లీ పోత‌రో.. మోదీ కాళ్లు ప‌ట్టుకుంటారో.. రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్

Kavitha Fires on CM Revanth Reddy: తెలంగాణ మిర్చి రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేస‌ముంద్రం మిర్చి యార్డును సందర్శించిన ఆమె.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 24, 2025, 06:34 PM IST
MLC Kavitha: సీఎం ఢిల్లీ పోత‌రో.. మోదీ కాళ్లు ప‌ట్టుకుంటారో.. రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్

Kavitha Fires on CM Revanth Reddy: ముఖ్య‌మంత్రి ఢిల్లీ పోతారా... ప్ర‌ధాని మోదీ కాళ్లు ప‌ట్టుకుంటారా.. ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ క‌చ్చితంగా రూ.25 వేల మ‌ద్ధ‌తు ధ‌ర సాధించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏపీలో కూడా మిర్చి ధ‌ర‌లు త‌గ్గ‌గా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల‌ను క‌లిసి లొల్లి లొల్లి చేశార‌ని.. ఇక్క‌డ మ‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నీసం ఒక మాట కూడా మాట్లాడ‌డం లేద‌ని విమ‌ర్శించారు. సోమ‌వారం ఎమ్మెల్సీ క‌విత కేస‌ముంద్రం మిర్చి యార్డును సందర్శించారు. క‌ష్టాలను, ఇబ్బందులు, మిర్చి ధ‌ర‌ల గురించి రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. 

అనంత‌రం కవిత మీడియాతో మాట్లాడుతూ.. మిర్చి ధ‌ర‌లు త‌గ్గి రాష్ట్ర‌వ్యాప్తంగా రైతులంతా ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌తేడాది  క్వింటాలు మిర్చి ధ‌ర రూ.25 వేలు  ఉండ‌గా.. అది ఈ సారి రూ.11 వేల‌కు ప‌డిపోయింద‌ని తెలిపారు. రైతులకు గిట్టుబాటు క‌ల్పించాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ఒక ఎక‌రా మిర్చి పంట సాగు చేయ‌డానికి రూ.2-3 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుందన్నారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే గిట్టుబాటు ధ‌ర‌ను క‌ల్పించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. మిర్చితో పాటు కూడా ప‌సుపు కూడా గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని అన్నారు.

మ‌హ‌బూబాబాద్-కేస‌ముద్రం ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం న‌రేందర్ రెడ్డి ఎప్పుడూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చుట్టే ఉంటారని..  ఓటుకు నోటు కేసులో కూడా ఒక‌రు ఏ1, మ‌రొక‌రు ఏ3గా ఉన్నార‌ని, అయినా కూడా మిర్చి రైతుల క‌ష్టాలు సీఎంకు చెప్ప‌డానికి వేం న‌రేంద‌ర్ రెడ్డికి ఒక్క నిమిషం దొర‌క‌డం లేదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు కూలిపోయింద‌ని చెప్ప‌డానికి సీఎం రేవంత్ రెడ్డి రైతుల‌కు నీళ్లు ఇవ్వ‌డం లేద‌ని.. దాంతో మ‌హ‌బూబాబాద్ ప్రాంతంలో 3 ల‌క్ష‌ల ఎక‌రాలు ఎండిపోయాయ‌ని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు విడుద‌ల చేయాల్సిందేన‌ని, లేదంటే రైతుల త‌ర‌ఫున తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని కవిత ప్ర‌క‌టించారు.

Also Read: BRS Party Joinings: ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి వలసలు

Also Read: Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు.. కీలక ఆదేశాలు జారీ చేసిన రిటర్నింగ్ అధికారి..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News